loader

శకునిలా చంద్రబాబు మాయ పాచికలు: వైఎస్‌ జగన్‌

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి.. పులివెందుల నేతలు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. ‘‘ఎన్నికలను చూస్తూంటే కౌరవుల కుట్రలన్నీ కనిపిస్తున్నాయి. శకునిలా చంద్రబాబు చేసిన మాయా పాచికలే ఇక్కడ కనబడుతున్నాయి. రాష్ట్రంలో వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ప్రజాస్వామ్యం కాపాడాల్సిన వ్యక్తులే ఖూనీ చేస్తున్నారు. భావితరాలకు మనం ఎలాంటి మెసేజ్‌ ఇస్తున్నాం. చంద్రబాబు పాపాల్లో భాగస్తులైన ప్రతి అధికారి ఆలోచించాలి. నామినేషన్‌ కేంద్రాలను ఆక్రమించడం దేశంలోనే ఎక్కడా లేదు’’ అని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు.

ఉస్మానియా ఆస్పత్రిలో జూడాల ఆందోళన

హైదరాబాద్ లోని ప్రముఖ ఉస్మానియా జనరల్ ఆస్పత్రి వద్ద జూనియర్ డాక్టర్లు, హౌస్ సర్జన్లు, పీజీ రెసిడెంట్లు భారీ నిరసన చేపట్టారు. నిధుల కొరత కారణంగా ఆస్పత్రిలో అత్యవసర మందులు, వైద్య పరికరాల కొరత ఏర్పడి రోగులకు వైద్యం అందించడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని TJUDA ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు.

‘ట్రిపుల్ ఇంజిన్’ సర్కార్ తోనే అభివృద్ధిలో స్పీడ్: సీఎం చంద్రబాబు

తాము చేస్తున్న అభివృద్ధిని గొడ్డలి పార్టీ సహించలేకపోతోందని తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు విమర్శించారు. స్థానిక ఎన్నికల నిర్వహణ పార్టీకి ఇష్టం లేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలు జరగకూడదనే ఉద్దేశంతో విధ్వంసానికి పాల్పడ్డారని ఆరోపించారు. స్థానిక ఎన్నికల్లో మంచి చెడులను విశ్లేషించి ప్రజలు ఓటు వేయాలని ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ అడుగుతున్నాం. కేంద్రం, రాష్ట్రంతో పాటు స్థానికంలోనూ కూటమికి అవకాశం ఇస్తే అభివృద్ధిలో స్పీడ్ పెరుగుతుంది.

సీట్ల సర్దుబాటు అనేది పెద్ద ఛాలెంజింగ్ – పవన్

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు పెద్ద సవాల్‌గా మారిందని జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం సులభంగా పూర్తయిందని, అయితే స్థానిక ఎన్నికల్లో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావహులు ఎక్కువగా ఉండటంతో అభ్యర్థుల ఎంపిక, స్థానాల కేటాయింపు కష్టతరంగా మారిందని వివరించారు.

పెన్షన్ల పంపిణీలో కీలక మార్పు.. ఈసారి ముందుగానే నగదు!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల లబ్ధిదారులకు ప్రభుత్వం కీలక అప్‌డేట్ ఇచ్చింది. నవంబర్ 1న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో పింఛన్ల పంపిణీ షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు సమాచారం. సాధారణంగా ప్రతి నెలా 1వ తేదీన అందించే పింఛన్లను ఈసారి ముందుగానే పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, అక్టోబర్ 30 నుంచే పింఛన్ల పంపిణీ చేపట్టాలని నిర్ణయించారు. పంపిణీ ప్రక్రియ నవంబర్ 5 వరకు కొనసాగవచ్చని […]

హైదరాబాద్‌లో వింత శబ్దం.. ఉలిక్కిపడిన జనం

హైదరాబాద్ లో పలు ప్రాంతాలలో ఉదయం 9:15 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దం వచ్చింది. ఉప్పర్‌పల్లి, ఎర్రబోడ, లంగర్‌హౌస్, కేశవస్వామినగర్ ప్రాంతాల ప్రజలు ఈ శబ్దానికి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఉదయాన్నే విస్ఫోటనాన్ని తలపించేలా వచ్చిన శబ్దంతో ఇళ్లలోని వస్తువులు తీవ్రంగా పక్కకు కదిలాయి. భూమి కంపించిందా లేక క్వారీల్లో బ్లాస్టింగ్ చేశారా అని స్థానికులు కంగారుపడ్డారు. 4 ప్రాంతాల ప్రజలు భయంతో ఇళ్ల నుంచి వీధుల్లోకి పరుగులు తీశారు. పోలీసులు, అధికారులు వెంటనే స్పందించి […]

అర్నబ్ ఎఫెక్ట్.. కోతకు గురైన ఉప్పాడ తీరం

ఏపీపై అర్నబ్ తుపాను ప్రభావం మొదలైంది. పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. సముద్రంలో అలలు భారీగా ఎగసిపడుతున్నాయి. కాకినాడ జిల్లా ఉప్పాడలో అలల తాకిడికి తీరం కోతకు గురైంది. ఇటీవల బాగా ఎత్తుగా నిర్మించిన రాళ్లగట్టును సైతం అలలు దాటుకుని విరుచుకుపడుతున్నాయి. దీంతో బీచ్ రోడ్డు పైకి రాళ్లు చేరడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. కవిటి, కంచిలి, సోంపేట, పలాస, టెక్కలి, పాతపట్నం, నరసన్నపేట, శ్రీకాకుళం, గార, లావేరు, ఆమదాలవలసలో తేలికపాటి వర్షం కురుస్తోంది. విశాఖపట్నం జిల్లా […]

ఎన్నికల్లో అక్రమాలు.. పట్టిస్తే ఏకంగా రూ. 8.3 కోట్లు రివార్డ్!

డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. గతంలో జరిగిన ఎన్నికల్లోగానీ, రాబోయే 2026 ‘మిడ్ టర్మ్’ ఎన్నికల్లోగానీ ఓట్ల అక్రమాలకు పాల్పడిన వారి గురించి సరైన సమాచారం అందిస్తే ఏకంగా 10 లక్షల అమెరికన్ డాలర్లు (భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 8.3 కోట్లు) పారితోషికంగా ఇస్తానని వెల్లడించారు. అయితే, ఇచ్చిన సమాచారం ఆధారంగా అక్రమాలకు పాల్పడిన వ్యక్తులను అరెస్టు చేసి, వారికి కోర్టు ద్వారా శిక్ష పడితేనే ఈ రివార్డు సొమ్ము దక్కుతుందని స్పష్టం చేశారు.

జాబ్ వదిలేస్తే బంపర్ ఆఫర్: భారత టెక్కీలకు మైక్రోసాఫ్ట్ బిగ్ అనౌన్స్‌మెంట్

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కీలక ప్రకటన చేసింది. భారత్, అమెరికా, బ్రిటన్, కెనడాల్లో పనిచేస్తోన్న 60,000 ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా వాలంటరీ ఎగ్జిట్ ప్రోగ్రామ్ ను అమలు చేయనున్నట్లు వెల్లడించింది. స్వచ్ఛందంగా సంస్థను వీడేందుకు సిద్ధపడే ఉద్యోగులకు లేఆఫ్ పరిహారాల తరహాలోనే మంచి బెనిఫిట్స్ అందుతాయని మైక్రోసాఫ్ట్ తెలిపింది. ప్రతి సంవత్సరానికి ఒక నెల బేసిక్ శాలరీని పరిహారంగా ఇవ్వనున్నట్లు వివరించింది. దీనితో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని పొడిగిస్తుందా సంస్థ. భారత్ లో మైక్రోసాఫ్ట్ లో […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON