ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల లబ్ధిదారులకు ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. నవంబర్ 1న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో పింఛన్ల పంపిణీ షెడ్యూల్లో మార్పులు చేసినట్లు సమాచారం. సాధారణంగా ప్రతి నెలా 1వ తేదీన అందించే పింఛన్లను ఈసారి ముందుగానే పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, అక్టోబర్ 30 నుంచే పింఛన్ల పంపిణీ చేపట్టాలని నిర్ణయించారు. పంపిణీ ప్రక్రియ నవంబర్ 5 వరకు కొనసాగవచ్చని వార్తా కథనంలో పేర్కొన్నారు.