టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కీలక ప్రకటన చేసింది. భారత్, అమెరికా, బ్రిటన్, కెనడాల్లో పనిచేస్తోన్న 60,000 ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా వాలంటరీ ఎగ్జిట్ ప్రోగ్రామ్ ను అమలు చేయనున్నట్లు వెల్లడించింది. స్వచ్ఛందంగా సంస్థను వీడేందుకు సిద్ధపడే ఉద్యోగులకు లేఆఫ్ పరిహారాల తరహాలోనే మంచి బెనిఫిట్స్ అందుతాయని మైక్రోసాఫ్ట్ తెలిపింది. ప్రతి సంవత్సరానికి ఒక నెల బేసిక్ శాలరీని పరిహారంగా ఇవ్వనున్నట్లు వివరించింది. దీనితో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని పొడిగిస్తుందా సంస్థ. భారత్ లో మైక్రోసాఫ్ట్ లో దాదాపు 23,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.