తుపాను వేళ ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాను వల్ల ఏదైనా సమస్య ఎదురైతే అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ ద్వారా అవకాశం కల్పించింది. మనమిత్ర నెంబర్ 9552300009 నంబర్‌కు హాయ్ అని మెసెజ్ చేసి సేవల జాబితాలో అర్నబ్ సైక్లోన్ ఇష్యూస్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. రిపోర్ట్ ఇష్యూస్, కన్ఫర్మ్, రిజిస్ట్రేషన్ ఆప్షన్లను వరుసగా ఎంపిక చేసుకోవాలి. అక్కడ పేరు, జిల్లా, మండలం వివరాలతో పాటు సమస్యను నమోదు చేయాలి. సమస్యకు సంబంధించిన ఫొటోలు కూడా అప్లోడ్ చేయొచ్చు.

