స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు పెద్ద సవాల్‌గా మారిందని జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం సులభంగా పూర్తయిందని, అయితే స్థానిక ఎన్నికల్లో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావహులు ఎక్కువగా ఉండటంతో అభ్యర్థుల ఎంపిక, స్థానాల కేటాయింపు కష్టతరంగా మారిందని వివరించారు.