డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. గతంలో జరిగిన ఎన్నికల్లోగానీ, రాబోయే 2026 ‘మిడ్ టర్మ్’ ఎన్నికల్లోగానీ ఓట్ల అక్రమాలకు పాల్పడిన వారి గురించి సరైన సమాచారం అందిస్తే ఏకంగా 10 లక్షల అమెరికన్ డాలర్లు (భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 8.3 కోట్లు) పారితోషికంగా ఇస్తానని వెల్లడించారు. అయితే, ఇచ్చిన సమాచారం ఆధారంగా అక్రమాలకు పాల్పడిన వ్యక్తులను అరెస్టు చేసి, వారికి కోర్టు ద్వారా శిక్ష పడితేనే ఈ రివార్డు సొమ్ము దక్కుతుందని స్పష్టం చేశారు.