ఏపీపై అర్నబ్ తుపాను ప్రభావం మొదలైంది. పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. సముద్రంలో అలలు భారీగా ఎగసిపడుతున్నాయి. కాకినాడ జిల్లా ఉప్పాడలో అలల తాకిడికి తీరం కోతకు గురైంది. ఇటీవల బాగా ఎత్తుగా నిర్మించిన రాళ్లగట్టును సైతం అలలు దాటుకుని విరుచుకుపడుతున్నాయి. దీంతో బీచ్ రోడ్డు పైకి రాళ్లు చేరడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. కవిటి, కంచిలి, సోంపేట, పలాస, టెక్కలి, పాతపట్నం, నరసన్నపేట, శ్రీకాకుళం, గార, లావేరు, ఆమదాలవలసలో తేలికపాటి వర్షం కురుస్తోంది. విశాఖపట్నం జిల్లా భీమిలి తీరంలో అలలు ఉద్ధృతంగా ఎగిసిపడుతున్నాయి.