తాము చేస్తున్న అభివృద్ధిని గొడ్డలి పార్టీ సహించలేకపోతోందని తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు విమర్శించారు. స్థానిక ఎన్నికల నిర్వహణ పార్టీకి ఇష్టం లేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలు జరగకూడదనే ఉద్దేశంతో విధ్వంసానికి పాల్పడ్డారని ఆరోపించారు. స్థానిక ఎన్నికల్లో మంచి చెడులను విశ్లేషించి ప్రజలు ఓటు వేయాలని ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ అడుగుతున్నాం. కేంద్రం, రాష్ట్రంతో పాటు స్థానికంలోనూ కూటమికి అవకాశం ఇస్తే అభివృద్ధిలో స్పీడ్ పెరుగుతుంది.