‘రామాయణ’ సినిమాలోని పాటలపై వస్తోన్న విమర్శలపై సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్పందించారు. మొదట విమర్శించిన వారే.. ఆ తర్వాత తమ అభిప్రాయాన్ని మార్చుకుని క్షమాపణలు చెబుతున్నారని అన్నారు. విమర్శలను పట్టించుకోనని.. తన పనిని నిజాయతీగా చేయడంపైనే దృష్టి పెడతానని స్పష్టం చేశారు. ముఖ్యంగా ‘రావణ తాండవ్’, ‘రంగులు రంగులే’ పాటలపై చర్చ జరుగుతోన్న నేపథ్యంలో, నేను మాత్రం నా పని నిజాయతీగా చేశాను.. ప్రజలు దాన్ని ఆదరిస్తారని ఆశిస్తాను” అని రెహమాన్ పేర్కొన్నారు.