loader

ఢిల్లీ నిరసనలపై మోడీ కీలక వ్యాఖ్యలు- దసరా సంబరాల్లో ప్రసంగం..!

న్యూఢిల్లీలో జరిగిన దసరా వేడుకలకు హాజరైన ప్రధాని మోడీ.. శతాబ్దాల విదేశీ దండయాత్రలు, దోపిడీల తర్వాత భారతదేశం తన గుర్తింపును, వారసత్వాన్ని తిరిగి పొందుతోందన్నారు. అదే సమయంలో, శత్రువుల నుండి దేశాన్ని కాపాడుకోవడానికి ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.శ్రీరాముని ఆదర్శాలను సజీవంగా ఉంచే సంప్రదాయం కేవలం ఒక పండుగ మాత్రమే కాదని, అది ఎంతో మంది భారతీయులకు జీవశక్తి అన్నారు. ఈ సందర్భం కేవలం చెడుపై మంచి సాధించిన విజయానికి మించినదని, ఇది సత్యం, ధర్మం, సుపరిపాలనలకు […]

‘RSS పురుషులకే పరిమితమైన సంస్థ- మహిళల్ని తమ ఆస్తిగా చూస్తుంది’- రాహుల్ గాంధీ

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ (RSS) లక్ష్యంగా లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఆర్ఎస్ఎస్ అనేది కేవలం పురుషులకే పరిమితమైన సంస్థ అని, మహిళలను కేవలం పురుషుల ఆస్తిగానే చూసే భావజాలాన్ని కలిగి ఉందని ఆరోపించారు. తాను మాత్రం శివశక్తిని విశ్వసిస్తానని పేర్కొన్నారు. భారతదేశ రాజ్యాంగాన్ని, మహిళా హక్కుల్ని రక్షించడానికి ఆర్ఎస్ఎస్‌తో పోరాడటమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

బంగారు గని కూలి 14 మంది కార్మికులు మృతి

కొలంబియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సరియైన అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఒక ఓపెన్ పిట్ బంగారు గని అకస్మాత్తుగా కూలిపోవడంతో 14 మంది కార్మికులు దుర్మరణం పాలయ్యారు. నారిణో ప్రావిన్సులోని సుదూర ప్రాంతంలో సోమవారం ఈ దుర్ఘటన జరిగినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. గడిచిన మూడు నెలల వ్యవధిలోనే నారిణో ప్రాంతంలో రెండు గనులు కూలిపోయి ఏకంగా 27 మంది ప్రాణాలు కోల్పోయారు” అని ప్రభుత్వం తమ ప్రకటనలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

కరవును జయించే శక్తి ఇవ్వాలని దుర్గమ్మను కోరుకున్నా: చంద్రబాబు

అంగరంగ వైభవంగా సాగిన విజయవాడ ఉత్సవ్ 2.0 వేడుకలు ఘనంగా ముగిశాయి. ముగింపు వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. కరవును జయించే శక్తిని ఇవ్వాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని దుర్గమ్మను కోరుకున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నామని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ముగింపు వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్నివాల్ ఆకట్టుకుంది. దసరా శరన్నవరాత్రి ముగింపు వేడుకల సందర్భంగా కృష్ణా నదిలో హంసవాహన […]

ఢిల్లీ హైకోర్టుకు సీజేపీ నేతలు సౌరవ్, అశుతోష్- అత్యవసర విచారణ..!

తీహార్ జైలులో జ్యుడిషియల్ కస్టడీ వున్న కాక్రోచ్ జనతా పార్టీ నేతలు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ విడుదల చేయాలని కోరుతూ కాక్రోచ్ పార్టీ లీగల్ విభాగం ఇవాళ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తమ పిటిషన్ పై అత్యవసర విచారణ జరపాలని హైకోర్టును కోరింది. దీనిపై కాసేపట్లో హైకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇవాళ రాత్రి కల్లా వీరిద్దరికీ విధించిన జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు […]

చంద్రబాబు కు భయం పట్టుకుంది – రోజా

ఇప్పటివరకు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పేరు, వైఎస్సార్‌సీపీ ఫ్యాన్ గుర్తును చూసి భయపడిన కూటమి ప్రభుత్వం, ఇప్పుడు ఎన్నికల బరిలో నిలిచిన జగన్ కౌన్సిలర్ అభ్యర్థులను చూసి కూడా వణికిపోతోందని వైఎస్సార్‌సీపీ నాయకురాలు రోజా వ్యాఖ్యానించారు. 2024 సాధారణ ఎన్నికల్లో EVMల అక్రమాలతో గెలిచారని, కానీ ఈ మున్సిపల్ ఎన్నికలు బ్యాలెట్ పేపర్ విధానంలో జరుగుతుండటంతో అసలు ఫలితాలు ఎలా ఉంటాయోనన్న భయం చంద్రబాబును వెంటాడుతోందని ఆమె ఆరోపించారు. బ్యాలెట్ విధానంలో అవకతవకలకు తావుండదనే ఈ భయాందోళనలు […]

పూర్తిగా మారిపోయిన కేటీఆర్ లుక్!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొత్త లుక్ లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. పెరిగిన గడ్డంతో సరికొత్త స్టైల్లో కనిపించిన ఆయన, ఎర్రవల్లి ఫాంహౌస్ లో జరిగిన దసరా వేడుకల్లో సందడి చేశారు. కేసీఆర్ నివాసంలో జరిగిన ఈ వేడుకలకు కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు. అయితే, కేటీఆర్ కొత్త లుక్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది.

డేటా సెంటర్లపై ఉక్రెయిన్ దాడి.. రష్యాలో నిలిచిపోయిన సేవలు

రష్యా డేటా సెంటర్లే లక్ష్యంగా సాగిన ఉక్రెయిన్ దాడుల వల్ల ఆ దేశంలో పబ్లిక్ లైఫ్ తీవ్రంగా ప్రభావితమైంది. రష్యా గూగుల్‌గా ప్రాచుర్యం పొందిన టెక్ దిగ్గజం ‘యాండెక్స్’ (Yandex), ‘స్బెర్‌బ్యాంక్’ (Sberbank), మరియు ‘VK’లకు చెందిన డేటా సెంటర్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీని పరిణామంగా రష్యన్ పౌరులు రోజువారీ వినియోగించే టాక్సీ బుకింగ్స్, ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌లు, బ్యాంకింగ్ లావాదేవీలతో పాటు ఇళ్లకు ఉండే డిజిటల్ డోర్ యాక్సెస్ సిస్టమ్‌ల వరకు అనేక సేవలు […]

దుర్గమ్మను దర్శించుకున్న గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్

ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం అమ్మవారి ఆలయానికి చేరుకున్న ఆయనకు అధికారులు, వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి అంతరాలయంలో గవర్నర్ ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ఆశీర్వచన మండపంలో గవర్నర్‌కు వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు.

సిరిమానోత్సవం ఎఫెక్ట్ – విజయనగరం కార్పొరేషన్ ఎన్నికల తేదీ మార్పు

ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం కారణంగా విజయనగరం నగరపాలక సంస్థ (కార్పొరేషన్) ఎన్నికల పోలింగ్ తేదీలో కీలక మార్పు జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన మున్సిపాలిటీలతో పాటు ఇక్కడ కూడా ఈ నెల 28వ తేదీనే పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే పండుగ రద్దీ, పరిపాలనాపరమైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పోలింగ్‌ను ఈ నెల 29వ తేదీకి మారుస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) అధికారికంగా అనుమతి మంజూరు చేసింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON