రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) లక్ష్యంగా లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఆర్ఎస్ఎస్ అనేది కేవలం పురుషులకే పరిమితమైన సంస్థ అని, మహిళలను కేవలం పురుషుల ఆస్తిగానే చూసే భావజాలాన్ని కలిగి ఉందని ఆరోపించారు. తాను మాత్రం శివశక్తిని విశ్వసిస్తానని పేర్కొన్నారు. భారతదేశ రాజ్యాంగాన్ని, మహిళా హక్కుల్ని రక్షించడానికి ఆర్ఎస్ఎస్తో పోరాడటమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

