న్యూఢిల్లీలో జరిగిన దసరా వేడుకలకు హాజరైన ప్రధాని మోడీ.. శతాబ్దాల విదేశీ దండయాత్రలు, దోపిడీల తర్వాత భారతదేశం తన గుర్తింపును, వారసత్వాన్ని తిరిగి పొందుతోందన్నారు. అదే సమయంలో, శత్రువుల నుండి దేశాన్ని కాపాడుకోవడానికి ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.శ్రీరాముని ఆదర్శాలను సజీవంగా ఉంచే సంప్రదాయం కేవలం ఒక పండుగ మాత్రమే కాదని, అది ఎంతో మంది భారతీయులకు జీవశక్తి అన్నారు. ఈ సందర్భం కేవలం చెడుపై మంచి సాధించిన విజయానికి మించినదని, ఇది సత్యం, ధర్మం, సుపరిపాలనలకు గుర్తుగా నిలుస్తుందన్నారు.

