ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం అమ్మవారి ఆలయానికి చేరుకున్న ఆయనకు అధికారులు, వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి అంతరాలయంలో గవర్నర్ ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ఆశీర్వచన మండపంలో గవర్నర్కు వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు.

