ఇప్పటివరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు, వైఎస్సార్సీపీ ఫ్యాన్ గుర్తును చూసి భయపడిన కూటమి ప్రభుత్వం, ఇప్పుడు ఎన్నికల బరిలో నిలిచిన జగన్ కౌన్సిలర్ అభ్యర్థులను చూసి కూడా వణికిపోతోందని వైఎస్సార్సీపీ నాయకురాలు రోజా వ్యాఖ్యానించారు. 2024 సాధారణ ఎన్నికల్లో EVMల అక్రమాలతో గెలిచారని, కానీ ఈ మున్సిపల్ ఎన్నికలు బ్యాలెట్ పేపర్ విధానంలో జరుగుతుండటంతో అసలు ఫలితాలు ఎలా ఉంటాయోనన్న భయం చంద్రబాబును వెంటాడుతోందని ఆమె ఆరోపించారు. బ్యాలెట్ విధానంలో అవకతవకలకు తావుండదనే ఈ భయాందోళనలు కూటమి నాయకుల్లో కనిపిస్తున్నాయని రోజా పేర్కొన్నారు.

