ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం కారణంగా విజయనగరం నగరపాలక సంస్థ (కార్పొరేషన్) ఎన్నికల పోలింగ్ తేదీలో కీలక మార్పు జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన మున్సిపాలిటీలతో పాటు ఇక్కడ కూడా ఈ నెల 28వ తేదీనే పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే పండుగ రద్దీ, పరిపాలనాపరమైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పోలింగ్‌ను ఈ నెల 29వ తేదీకి మారుస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) అధికారికంగా అనుమతి మంజూరు చేసింది.

