రష్యా డేటా సెంటర్లే లక్ష్యంగా సాగిన ఉక్రెయిన్ దాడుల వల్ల ఆ దేశంలో పబ్లిక్ లైఫ్ తీవ్రంగా ప్రభావితమైంది. రష్యా గూగుల్గా ప్రాచుర్యం పొందిన టెక్ దిగ్గజం ‘యాండెక్స్’ (Yandex), ‘స్బెర్బ్యాంక్’ (Sberbank), మరియు ‘VK’లకు చెందిన డేటా సెంటర్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీని పరిణామంగా రష్యన్ పౌరులు రోజువారీ వినియోగించే టాక్సీ బుకింగ్స్, ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్లు, బ్యాంకింగ్ లావాదేవీలతో పాటు ఇళ్లకు ఉండే డిజిటల్ డోర్ యాక్సెస్ సిస్టమ్ల వరకు అనేక సేవలు నిలిచిపోయి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

