తీహార్ జైలులో జ్యుడిషియల్ కస్టడీ వున్న కాక్రోచ్ జనతా పార్టీ నేతలు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ విడుదల చేయాలని కోరుతూ కాక్రోచ్ పార్టీ లీగల్ విభాగం ఇవాళ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తమ పిటిషన్ పై అత్యవసర విచారణ జరపాలని హైకోర్టును కోరింది. దీనిపై కాసేపట్లో హైకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇవాళ రాత్రి కల్లా వీరిద్దరికీ విధించిన జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు విచారణ జరపాలని లాయర్లు కోరారు.

