loader

ఢిల్లీలో బ్రిక్స్ సదస్సుకు సర్వం సిద్ధం.. ప్రధాని మోదీ ట్వీట్

18వ బ్రిక్స్ సదస్సు కోసం ఢిల్లీలోని ప్రఖ్యాత ‘భారత్ మండపం’ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ద్వారా ఒక ప్రత్యేక వీడియోను దేశవిదేశాల ప్రజలతో పంచుకున్నారు. ప్రపంచ దేశాల అగ్రనేతలకు ఘన స్వాగతం పలికేందుకు పూర్తిగా సిద్ధమైన భారత్ మండపం సుందర దృశ్యాలను ఆ వీడియోలో ప్రదర్శించారు.  “బ్రిక్స్ 2026కు సర్వం సిద్ధం!” అని పేర్కొంటూ ఆయన సదస్సుపై ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు.

కుమారుడి ఫొటోను రివీల్‌ చేసిన వరుణ్‌తేజ్‌-లావణ్య దంపతులు

నటుడు వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి దంపతులు తొలిసారిగా తమ కుమారుడి ఫొటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.   గత ఏడాది సెప్టెంబర్ 10న వరుణ్- లావణ్య దంపతులకు కుమారుడు పుట్టిన విషయం తెలిసిందే.   తమ కుమారుడికి ‘వాయువ్ తేజ్’ అని పేరు పెట్టినట్లు గతంలో వెల్లడించారు.   వాయువ్ మొదటి బర్త్ డే సందర్భంగా తొలిసారిగా చిన్నారి ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ప్రధాని మోడీతో ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-5 భేటీ

షియా ఇస్మాయిలీ ముస్లింల 50వ ఆధ్యాత్మక నాయకుడు (ఇమామ్), ఆగా ఖాన్ డవలప్‌మెంట్ నెట్‌వర్క్ (ఏకేడీఎన్) చైర్మన్ ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-5 గురువారంనాడు న్యూఢిల్లీ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి సహా పలు రంగాల్లో ఏకేడీఎన్‌తో భారత్ భాగస్వామ్యంపై ఉభయులు చర్చించారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఆహ్వానం మేరకు ప్రిన్స్ రహీం ఆగా ఖాన్ ఈనెల 9 నుంచి 15 వరకూ భారత్‌లో పర్యటిస్తున్నారు.

ఏఐ పిక్స్‌తో ‘రాజకీయ రచ్చ’.. బీజేపీ vs కాంగ్రెస్​!

సోషల్ మీడియాలో ‘1980ల నాటి ట్రెండ్’ పేరుతో AI ఫోటోలతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విమర్శలు కలకలం రేపుతున్నాయి. నేతల వ్యక్తిత్వ హననానికి తెరదీస్తూ ఇరు పార్టీలు చేస్తున్న పోస్టులపై బీఆర్ఎస్ నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ తెలంగాణ సోనియా గాంధీని ఉద్దేశిస్తూ, ఆమెను ఒక క్లబ్ డ్యాన్సర్గా చిత్రీకరిస్తూ ఏఐ ఫోటోను పోస్ట్ చేశారు. దీనికి కౌంటర్ తెలంగాణ కాంగ్రెస్ ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుంటూ, రైల్వే స్టేషన్లో ప్రయాణికుల జేబులోంచి పర్స్ కొట్టేస్తున్నట్లుగా ఒక […]

టాస్ ఓడిన భారత్.. అందరి ఫోకస్ ఆమెపైనే..!

మహిళల ఆసియా కప్ తొలి సెమీ-ఫైనల్‌లో భారత్, బంగ్లాదేశ్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్ దుబాయ్  అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. గత ఎనిమిది మహిళల టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో బంగ్లాదేశ్‌పై భారత్ అజేయంగా నిలిచింది.  బంగ్లాదేశ్ చివరిసారిగా 2023 జులై 13న భారత్‌ను ఓడించింది. ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య 24 అంతర్జాతీయ మ్యాచ్‌లు జరగ్గా, వాటిలో భారత్ 21 మ్యాచ్‌లలో విజయం సాధించింది.

9/11 దాడి.. న్యూయార్క్‌లో ఎగిరిన 2,977 డ్రోన్లు

సెప్టెంబరు 11, 2001న ఉదయం న్యూయార్క్ లోని ప్రపంచ ప్రఖ్యాత వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్స్ ను ఉగ్రవాదులు రెండు విమానాలతో కూల్చిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగి 25 ఏళ్లు అయింది. ఈ నేపథ్యంలో ఆనాటి ఘటనలో మృతిచెందిన వారికి నివాళిగా న్యూయార్క్ హార్బర్ పై 2,977 డ్రోన్లు ఎగిరాయి. ఒక్కో డ్రోన్ ఒక్కో బాధితుడికి నివాళిగా ట్విన్ టవర్స్ రూపంలో ప్రదర్శించారు.

పాక్‌ను దాటేసిన భారత్.. మన అమ్ములపొదిలో 190 అణ్వాయుధాలు..

అణ్వాయుధ సామర్థ్యంలో సత్తా చాటుతున్న భారతదేశం.. నిల్వల విషయంలో దాయాది పాకిస్థాన్‌ను వెనక్కి నెట్టింది. మన దేశ అమ్ములపొదిలో ప్రస్తుతం 190 అణు వార్‌హెడ్లు ఉన్నాయని అమెరికాకు చెందిన ‘ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ (FAS)’ వెల్లడించింది. పాకిస్థాన్ వద్ద 170 అణ్వాయుధాలు ఉండగా.. భారత్ వాటి సంఖ్యను 190కి పెంచుకున్నట్లు తెలిపింది. త్వరలోనే బ్రిటన్ (225) నిల్వలను కూడా మన దేశం అధిగమించే అవకాశం ఉందని ‘ఇండియాస్ న్యూక్లియర్ వెపన్స్ – 2026’ నివేదికలో పేర్కొన్నారు.

ఈ రోజు రాత్రి భారీ వర్షం.. 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..

ఏపీలోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. రాగల మూడు గంటల సమయంలో వర్ష ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. విశాఖపట్నం, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. వర్షంతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.

బ్రిక్స్ స‌ద‌స్సుకు మా ప్ర‌ధానికి ఆహ్వానం అంద‌లేదు.. బంగ్లాదేశ్ అసంతృప్తి

ప్ర‌తిష్టాత్మ‌క బ్రిక్స్ స‌ద‌స్సు శుక్ర‌వారం నుంచి ఢిల్లీలో ప్రారంభం కానుంది. ఈ స‌ద‌స్సుకు త‌మ ప్ర‌ధాని తారిక్ రహ‌మాన్‌కు ఆహ్వానం అంద‌లేద‌ని బంగ్లాదేశ్ తెలిపింది. ఈ విష‌యాన్ని బంగ్లాదేశ్ విదేశీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి హుమాయున్ క‌బిర్ గురువారం వెల్ల‌డించారు. బ్రిక్స్ స‌ద‌స్సుకు ఆహ్వానం లేనందున త‌మ ప్ర‌ధాని ఇండియా వెళ్ల‌డం లేద‌ని ఆయ‌న తెలిపారు. బిమ్‌స్టెక్ కూట‌మికి ప్ర‌స్తుతం బంగ్లాదేశ్ అధ్య‌క్ష‌త వ‌హిస్తున్నందున ఈ హోదాలో బంగ్లాకు ప్ర‌త్యేక ఆహ్వానం అందింద‌న్న ప్ర‌చారాన్ని హుమాయున్ క‌బిర్ […]

ఢిల్లీకి బయలుదేరిన బీఆర్‌ఎస్‌ మహిళా ఎమ్మెల్యేలు..

బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవ లక్ష్మి ఢిల్లీకి బయలుదేరారు. అసెంబ్లీ ప్రాంగణంలో వారి మీద జరిగిన దాడిపై జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్లకు ఫిర్యాదు చేయనున్నారు. మహిళా ఎమ్మెల్యేలని కూడా చూడకుండా కర్కశంగా వ్యవహరించిన పోలీస్‌ యంత్రాంగం సబితా ఇంద్రారెడ్డి జుట్టు పట్టుకొని అమానుషంగా ప్రవర్తించారు. అంతటితో ఆగకుండా నలుపు రంగు చీర ధరించి అసెంబ్లీకి వెళ్తున్న సునీతా లక్ష్మారెడ్డి చీర లాగి అవమానించారు

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON