బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవ లక్ష్మి ఢిల్లీకి బయలుదేరారు. అసెంబ్లీ ప్రాంగణంలో వారి మీద జరిగిన దాడిపై జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్లకు ఫిర్యాదు చేయనున్నారు. మహిళా ఎమ్మెల్యేలని కూడా చూడకుండా కర్కశంగా వ్యవహరించిన పోలీస్ యంత్రాంగం సబితా ఇంద్రారెడ్డి జుట్టు పట్టుకొని అమానుషంగా ప్రవర్తించారు. అంతటితో ఆగకుండా నలుపు రంగు చీర ధరించి అసెంబ్లీకి వెళ్తున్న సునీతా లక్ష్మారెడ్డి చీర లాగి అవమానించారు