ిగ్గజ టెక్ సంస్థ యాపిల్ తన మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ‘ఐఫోన్ డ్యూయో’పై ప్రత్యర్థి సంస్థ శామ్‌సంగ్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు, సెటైర్లు గుప్పించింది. తాము ఏడేళ్ల క్రితమే మార్కెట్‌లోకి తీసుకొచ్చిన ఫోల్డబుల్ టెక్నాలజీని యాపిల్ ఇప్పుడు ఏదో విప్లవాత్మకమైన కొత్త ఆవిష్కరణగా ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేసింది. “గతంలో వండి మిగిలిపోయిన ఆహారాన్ని మళ్లీ వేడి చేసి సరికొత్తగా వడ్డించినట్లుంది” అంటూ శామ్‌సంగ్ చేసిన ఘాటు వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.