తెలంగాణ సచివాలయంలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు చేపట్టిన చర్యలు కలకలం రేపుతున్నాయి. సీఎం రిలీఫ్ ఫండ్‌కు సంబంధించిన వ్యవహారంలో లంచం తీసుకుంటుండగా ఓ సెక్షన్ ఆఫీసర్‌తో పాటు ఔట్సోర్సింగ్ ఉద్యోగిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రూ.లక్ష లంచం తీసుకుంటున్న సమయంలో సచివాలయంలో పనిచేస్తున్న సెక్షన్ ఆఫీసర్ వినోద్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగి రాఘవేంద్ర పాత్ర కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.