ఫ్యూచర్ సిటీ భవిష్యత్తులో ఉండబోదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫార్మా సిటీ కోసం మాత్రమే భూ సేకరణ జరిగిందని.. అక్కడ మరో సిటీ పెడితే రద్దవుతుందని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డిని నమ్మి.. ఇక్కడ పెట్టుబడులు పెట్టి తరువాత బలిపశువులు కావొద్దని హెచ్చరించారు. తుక్కుగూడలో సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి చెందిన కంపెనీ టెస్సరాక్ట్ సిస్టం ప్రైవేట్ లిమిటెడ్ కు ప్రభుత్వం కేటాయించిన భూములను హరీశ్ రావు సహా పలువురు ఎమ్మెల్యేలతో కేటీఆర్ పరిశీలించారు.