తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలిరోజు జరిగిన ఉద్రిక్తతలకు సంబంధించి బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు, సుధీర్ రెడ్డి, నవీన్ రెడ్డిలపై హైదరాబాద్లోని సైఫాబాద్ పోలీసులు లైంగిక కేసు నమోదు చేశారు. అసెంబ్లీ గేట్ నంబర్ 3 వద్ద విధుల్లో ఉన్న తమతో వారు అసభ్యంగా ప్రవర్తించారంటూ ఓ మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వారిపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ నేతలు టీషర్టులు విప్పి తమ ముందు అర్ధనగ్నంగా నిలబడ్డారని,అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని తెలిపారు.