ఇంటర్మీడియట్ విద్యారంగంలో సమూల మార్పులు తీసుకువచ్చేలా ఏపీ ఇంటర్ పరీక్షా విధానంలో
కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విద్యార్థులు కేవలం కంఠస్థం చేసి పరీక్షల్లో రాసే పాత పద్ధతికి త్వరలోనే పూర్తిగా స్వస్తి పలకనున్నారు.వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రశ్నపత్రాల్లో పది శాతం ప్రశ్నలను విద్యార్థులు అంశాలను ఏ విధంగా అర్థం చేసుకున్నారు అలాగే కొత్త పరిస్థితుల్లో వాటిని ఎలా ఉపయోగించగలరు అనే కోణంలో ప్రశ్నలు ఉంటాయి.ఉపాధ్యాయుల నుంచి సేకరించిన సృజనాత్మక ప్రశ్నలతో ప్రత్యేక క్వశ్చన్ బ్యాంక్ రూపొందించి కొత్త పాఠ్యపుస్తకాల్లో ముద్రించనున్నారు.