అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం, తన తాజా వలసల నియంత్రణ ప్రకటనలో భారతీయులపై జాత్యహంకార వ్యాఖ్య చేసి మరోసారి వివాదాన్ని రేకెత్తించింది. ‘ట్రాన్స్ఫార్మర్స్’ పేరడీ పోస్టర్లో, ఒక రోబో కండువా కట్టుకున్న గోధుమ వర్ణపు వ్యక్తిని “మిస్టర్ సింగ్” అని సంబోధిస్తున్నట్లుగా ఉంది. అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖకు చెందిన ‘X’ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ డిజిటల్ ప్రకటనలో,“మా రోడ్ల మీద నుండి దిగిపోండి, మీకు డ్రైవింగ్ రాదు, మిస్టర్ సింగ్” అనే సందేశం కనిపిస్తుంది.