మెదక్ జిల్లాలో కల్లు సేవిస్తున్న నలుగురికి నిర్వహించిన డ్రగ్ పరీక్షల్లో పాజిటివ్ ఫలితాలు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తూప్రాన్‌లో కల్లు దుకాణాలను ఈగల్ టీం ఆకస్మికంగా తనిఖీ చేసి పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫలితాలు ప్రాథమిక పరీక్షలకు సంబంధించినవే కావడంతో.. వారికి ఏ పదార్థం కారణంగా పాజిటివ్ వచ్చిందన్నది ఇంకా తేలాల్సి ఉంది. కల్లు సరఫరా అయ్యే డిపోపైనా తనిఖీలు చేపట్టి సుమారు 45 బాక్సుల కల్లు సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.