ఫేక్ ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయ కుట్రలకు అధికారులు వేగంగా కౌంటర్ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. డీఎస్సీ నియామకాల్లో ఎలాంటి తప్పు జరగలేదని, స్పోర్ట్స్ కోటాలో నిబంధనల ప్రకారమే ఉద్యోగాలు ఇచ్చామని తేల్చిచెప్పారు. దుష్ప్రచారాన్ని తిప్పికొట్టిన ఇద్దరు మహిళా అధికారులను అభినందించిన సీఎం, సరైన సమయంలో స్పందించకపోతే ఆ నష్టం ప్రభుత్వానికే చుట్టుకుంటుందని హెచ్చరించారు. సమీక్షలకే పరిమితం కాకుండా ఫలితాలపై దృష్టి పెట్టాలని, ప్రతి నియోజకవర్గంలో 10–15 ప్రాధాన్య ప్రాజెక్టులను గుర్తించి అభివృద్ధి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.