చైనాలోని చింగ్డావో బెహై షిప్‌యార్డ్‌లో ఓ నౌకలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో దాదాపు 20 మంది మృతి చెందారు. మరో ఐదుగురు గల్లంతయ్యారు. లైబీరియా జెండాతో ప్రయాణిస్తున్న ‘ఓషన్ మెలోడీ’ అనే సరకు రవాణా నౌక.. మరమ్మతుల కోసం చింగ్డావో బెహై షిప్‌యార్డ్‌లో ఆగింది. అక్కడే నౌకలో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో నౌకలో మొత్తం 42 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలంలో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆదేశాలు జారీ చేశారు.