సోషల్ మీడియాలో ‘1980ల నాటి ట్రెండ్’ పేరుతో AI ఫోటోలతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విమర్శలు కలకలం రేపుతున్నాయి. నేతల వ్యక్తిత్వ హననానికి తెరదీస్తూ ఇరు పార్టీలు చేస్తున్న పోస్టులపై బీఆర్ఎస్ నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ తెలంగాణ సోనియా గాంధీని ఉద్దేశిస్తూ, ఆమెను ఒక క్లబ్ డ్యాన్సర్‌గా చిత్రీకరిస్తూ ఏఐ ఫోటోను పోస్ట్ చేశారు. దీనికి కౌంటర్ తెలంగాణ కాంగ్రెస్ ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుంటూ, రైల్వే స్టేషన్లో ప్రయాణికుల జేబులోంచి పర్స్ కొట్టేస్తున్నట్లుగా ఒక ఏఐ ఫోటోను సృష్టించి పోస్ట్ చేసింది.