ఇస్రో జరిపిన తాజా పరిశోధనల్లో పసిఫిక్ మహాసముద్ర పరిధిలో ఎల్ నినో ప్రభావం ముందుగా అంచనా వేసిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు తేలింది. సాధారణంగా పసిఫిక్ రీజియన్ లో తూర్పు దిశగా వీచే గాలులు ఒక్కసారిగా బలహీనపడి, పడమర దిశగా వీచడం ప్రారంభించాయి. ఇస్రో సేకరించిన తాజా డేటా నిర్ధారించింది. జూలై నెలాఖరు నాటికి ఈ ప్రక్రియ మరింత వేగవంతమైంది. ఒకవేళ ఎల్ నినో ప్రభావం గనుక ఇంకా తీవ్రమైతే, క్లోరోఫిల్ తక్కువగా ఉండే ప్రాంతాలు మరింత ముప్పును ఎదుర్కొనడం ఖాయం.