అసెంబ్లీ ప్రాంగణంలో మహిళా ఎమ్మెల్యేల పట్ల కీచకంగా వ్యవహరించారని బీఆర్ఎస్(BRS) మహిళా ఎమ్మెల్యేలు దిల్లీలో జాతీయ మానవహక్కుల కమిషన్ సభ్యురాలు విజయభారతిని కలిసి ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ వద్ద మాకు జరిగిన అవమానం చాలా బాధ అనిపించింది. మహిళా ఎమ్మెల్యేల జుట్టు పట్టుకుని లాగుతూ అరాచకం సృష్టించే యత్నం చేశారు. కుట్రలో భాగంగానే ఇదంతా జరిగిందని అర్థమవుతోంది. మమ్మల్ని రక్షించేందుకు మా ఎమ్మెల్యేలు ప్రయత్నించారు. దాడి ఘటనపై డీజీపీ ఆఫీసులో ఫిర్యాదు చేసినా ఎవరూ స్పందించలేదని సబితా ఇంద్రారెడ్డి వివరించారు.