మద్యం మత్తులో ఓ యువతీ, యువకుడు వీరంగం సృష్టించి హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్డు 14లో వోక్స్‌వ్యాగన్ కారుతో ర్యాష్ డ్రైవింగ్ చేశారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు మహిళలను కారుతో ఢీకొట్టడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. రంజనా రాయ్ (32) అనే మహిళకు తీవ్రంగా గాయపడడంతో నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మరో మహిళ స్వల్ప గాయపడినట్టు సమాచారం. పోలీసులు స్థలానికి చేరుకొని యువతీ, యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.