కలెక్టర్ల సదస్సు రెండో రోజు ఫైళ్ల క్లియరెన్స్ ఆలస్యం చేస్తున్న అధికారులు, మంత్రులపై సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. వాట్సాప్ మెసేజ్ లపై పెడుతున్న శ్రద్ధ.. ఫైళ్ల క్లియరెన్స్ పై ఎందుకు చూపించడం లేదంటూ తన కేబినెట్లోని ముగ్గురు మంత్రులతో పాటు పలు శాఖల అధికారులపై సీఎం సీరియస్ అయ్యారు. ఫోన్లు లేకుండా కొన్ని గంటలు కూడా ఉండలేకపోతున్నారా అని అసహనం వ్యక్తం చేశారు.కలెక్టర్ల సదస్సుకు రాని అధికారులపైనా మండిపడ్డారు. కలెక్టర్ల సదస్సుకు గైర్హాజరు కావడానికి వారికి ఎంత ధైర్యం అని చంద్రబాబు ప్రశ్నించారు.