loader

ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వార్టర్స్‌లో సింధు, తన్వి

ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు, యువ సంచలనం తన్వి శర్మ క్వార్టర్ ఫైనల్స్ కు దూసుకెళ్లారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో ప్రపంచ 10వ ర్యాంకర్ పీవీ సింధు 42 నిమిషాల పాటు సాగిన పోరులో భారత్ కే చెందిన ఇషారాని బారువాపై 22-20, 21-12 తేడాతో విజయం సాధించింది. మొదటి గేమ్ గట్టి పోటీ ఎదురైనప్పటికీ, రెండో గేమ్ లో సింధు పూర్తిగా ఆధిపత్యం […]

మహిళా టీ20 వరల్డ్ కప్‌.. 2 లక్షల టికెట్లు విక్రయం!

2026 మహిళా టీ20 వరల్డ్ కప్ కు అభిమానుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. టోర్నీ ప్రారంభానికి ముందే 2 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయని టోర్నమెంట్ డైరెక్టర్ బెత్ బారెట్-వైల్డ్ వెల్లడించారు. ఈ మెగా టోర్నీలో 12 జట్లు పాల్గొనగా, మొత్తం 33 మ్యాచ్లు జరగనున్నాయి. జూన్ 12న ఎడ్జ్ బాస్టన్ పోటీలు ప్రారంభమై, జూలై 5న లార్డ్స్ జరిగే ఫైనల్తో ముగుస్తాయి. ఇంగ్లాండ్లో 2009 తర్వాత మహిళల టీ20 వరల్డ్ కప్ నిర్వహించబడుతోంది.

చిరంజీవి మెగా 158 ‘పొల్లాచ్చి’ షెడ్యూల్‌కు ప్యాక‌ప్‌.. ఫొటోలు వైర‌ల్

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్ట‌ర్ బాబీ కాంబోలో తాజా ప్రాజెక్ట్ మెగా 158. కొన్ని రోజులుగా కొన‌సాగుతున్న మెగా 158 పొల్లాచ్చి షెడ్యూల్ పూర్త‌యింది. ఈ సంద‌ర్భంగా సెట్స్‌లో చిరు అండ్ టీం దిగిన ఫొటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ప్ర‌ధాన తారాగ‌ణంపై వ‌చ్చే కీల‌క స‌న్నివేశాల‌ను ఈ షెడ్యూల్‌లో పూర్తి చేశార‌ని స‌మాచారం. కాగా నెక్ట్స్ షెడ్యూల్ కోసం చిరు అండ్ బాబీ టీం సిద్ద‌మ‌వుతుండ‌గా.. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అప్‌డేట్‌పై క్లారిటీ ఇవ్వ‌నుంది.

ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ.. చర్చించిన అంశాలు ఇవే..

తెలంగాణ రాష్ట్రానికి కీలకమైన పలు మౌలిక వసతుల ప్రాజెక్టులపై కేంద్రం సహకారం అందించాలని ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కోరారు. సాగు, తాగునీటి అవసరాల దృష్ట్యా గోదావరి జలాలను సమర్థంగా వినియోగించుకునేలా మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఫేజ్‌-2 విస్తరణ ప్రతిపాదనలను, హైదరాబాద్‌ రీజినల్‌ రింగ్‌ రోడ్‌ పనులకు వెంటనే ఆమోదం తెలపాలని హైదరాబాద్‌- అమరావతి- బందర్‌ పోర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ వేకు కేంద్రం అనుమతి ఇవ్వాలని […]

బెంగాల్‌లో అగ్నిప్రమాదం.. 4,000 ఈవీఎంలు దగ్ధం!

పశ్చిమ బెంగాల్ లోని ప్రభుత్వ భవనంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో దాదాపు 4,000 ఈవీఎంలు కాలిపోయాయి. బెంగాల్ మంత్రి కౌశిక్ చౌధురీ ఈ విషయాన్ని వెల్లడించారు. కోల్ కతాలోని అలీపుర్ ప్రాంతంలో ఉన్న తొమ్మిది అంతస్తుల భవనంలో బుధవారం మంటలు చెలరేగాయి. “అగ్ని ప్రమాదంలో దాదాపు 4,000 ఈవీఎంలు కాలిపోయాయి. ఈ ఈవీఎంలను ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సమయంలో 10 నియోజకవర్గాల్లో ఉపయోగించారు. ఇది సాధారణ అగ్ని ప్రమాదంలా కనిపించడం లేదు. ఏదైనా కుట్ర జరిగిందా? […]

కేంద్రంతో ఇలాగే ఉంటాం..! సీఎంల ముందే మోడీకి చెప్పేసిన విజయ్..!

నీతి ఆయోగ్ పదకొండవ పాలక మండలి సమావేశంలో తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ మాట్లాడుతూ, తమిళనాడు దేశ ఆకాంక్షలకు మనస్ఫూర్తిగా మద్దతు ఇస్తుందని తెలిపారు. తమిళనాడు ప్రయోజనాలు, ఆకాంక్షలను దృఢంగా కాపాడుకుంటూ, కేంద్ర ప్రభుత్వంతో నిర్మాణాత్మకంగా కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉన్నామని విజయ్ వెల్లడించారు. యువత, పేదలు, మహిళలు, రైతులు, తమిళనాడు ప్రాధాన్యతలు అనే నాలుగు స్తంభాలపై ఆధారపడి ఉందన్నారు. అలాగే వాటిలో ప్రతి దానితోనూ సన్నిహితంగా అనుసంధానించబడి ఉన్నాయని విజయ్ తెలిపారు.

రూ. 100 కోట్లతో సీఎం రేవంత్ విలాసవంతమైన గెస్ట్ హౌస్… హరీష్ రావు

సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి కొద్ది దూరంలోనే ఏకంగా రూ. 100 కోట్లతో బోధి పెవిలియన్ పేరుతో విలాసవంతమైన గెస్ట్ హౌస్ కట్టుకుంటున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అర్ధరాత్రి పూట సతీసమేతంగా వెళ్లి అక్కడి పనులను, కుటుంబ సభ్యులతో సోఫాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారని అన్నారు. ఈ గెస్ట్ హౌస్ కోసం మొదట వీవీఐపీ గెస్ట్ హౌస్ పేరుతో కేవలం రూ. 7 కోట్లతో జీవో ఇచ్చి, ఇప్పుడు దాన్ని […]

ఇంటర్‌లో పాసైన మాజీ మావోయిస్ట్ అగ్రనేత దేవ్‌జీ.. మార్కులు ఎన్నంటే?

ఆయుధాల మార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చిన మాజీ మావోయిస్ట్ అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ చదువు బాట పట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల రాసిన లాసెట్ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో ఏకంగా 349వ ర్యాంక్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచిన ఆయన.. మధ్యలో ఆపేసిన ఇంటర్ సెకండియర్ తెలుగు పరీక్షను ఇటీవల ఉన్నతాధికారుల ప్రత్యేక అనుమతితో రాశారు. ఫలితాల్లో తెలుగు పరీక్షలో దేవ్ జీ 72 మార్కులతో పాసయ్యారు. తద్వారా ఇంటర్లో మొత్తం 614 […]

ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో భారతీరాజా అంత్యక్రియలు పూర్తి

లెజెండరీ దర్శకుడు భారతీరాజా నిన్న ఆయన కన్నుమూసిన సంగతి తెలిసిందే. చెన్నైలో నివాళుల అనంతరం, భారతీరాజా పార్థివదేహాన్ని ఆయన స్వస్థలమైన దిండిగల్ జిల్లా, వత్తలగుండు ఘాట్రోడ్డులోని స్వంత వ్యవసాయ క్షేత్రానికి తరలించారు. తన మట్టిని, గ్రామీణ సంస్కృతిని అమితంగా ప్రేమించే ఆయన చివరి కోరిక మేరకు అక్కడే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.. తమిళనాడు ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించింది. పోలీసుల గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించిన అనంతరం, కుటుంబ సభ్యులు శాస్త్రోక్తంగా […]

PoKలో మరోసారి కాల్పులు.. 16 మంది మృతి

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) లో ఉద్రిక్తతలు మరోసారి పతాక స్థాయికి చేరాయి. స్థానిక ప్రజలు చేపట్టిన శాంతియుత నిరసనలపై పాకిస్థాన్ భద్రతా బలగాలు జరిపిన తాజా కాల్పుల్లో మరో 16 మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న హింసాత్మక ఘర్షణల్లో ఇప్పటికే 30 మంది మరణించగా, మొత్తం మృతుల సంఖ్య 46కు చేరుకుంది. భద్రతా దళాలు టియర్ గ్యాస్, లైవ్ ఫైరింగ్‌తో విరుచుకుపడుతుండటంతో స్థానికంగా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. పాక్ ప్రభుత్వ అణచివేత […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON