ఆయుధాల మార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చిన మాజీ మావోయిస్ట్ అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ చదువు బాట పట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల రాసిన లాసెట్ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో ఏకంగా 349వ ర్యాంక్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచిన ఆయన.. మధ్యలో ఆపేసిన ఇంటర్ సెకండియర్ తెలుగు పరీక్షను ఇటీవల ఉన్నతాధికారుల ప్రత్యేక అనుమతితో రాశారు. ఫలితాల్లో తెలుగు పరీక్షలో దేవ్ జీ 72 మార్కులతో పాసయ్యారు. తద్వారా ఇంటర్లో మొత్తం 614 మార్కులు సాధించారు.