లెజెండరీ దర్శకుడు భారతీరాజా నిన్న ఆయన కన్నుమూసిన సంగతి తెలిసిందే. చెన్నైలో నివాళుల అనంతరం, భారతీరాజా పార్థివదేహాన్ని ఆయన స్వస్థలమైన దిండిగల్ జిల్లా, వత్తలగుండు ఘాట్రోడ్డులోని స్వంత వ్యవసాయ క్షేత్రానికి తరలించారు. తన మట్టిని, గ్రామీణ సంస్కృతిని అమితంగా ప్రేమించే ఆయన చివరి కోరిక మేరకు అక్కడే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు..
తమిళనాడు ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించింది. పోలీసుల గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించిన అనంతరం, కుటుంబ సభ్యులు శాస్త్రోక్తంగా ఆయనకు తుది వీడ్కోలు పలికారు.