ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న నౌకపై అమెరికా చేసిన దాడిలో ముగ్గురు భారతీయులు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల్లో ఒకరు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందిన మెరైన్ ఇంజినీర్ సురేష్ పట్నాల(44) కూడా ఉన్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు ఢిల్లీలోని ఆంధ్రా భవన్ అధికారులు ధృవీకరించారు. సురేష్‌కు భార్య భార్గవితో పాటు 13, 10 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. ఐదు నెలల పాటు విధుల్లో ఉన్న సురేశ్.. త్వరలోనే ఇంటికి వచ్చేందుకు సిద్ధమైనట్లు తెలిసింది.