ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు, యువ సంచలనం తన్వి శర్మ క్వార్టర్ ఫైనల్స్ కు దూసుకెళ్లారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో ప్రపంచ 10వ ర్యాంకర్ పీవీ సింధు 42 నిమిషాల పాటు సాగిన పోరులో భారత్ కే చెందిన ఇషారాని బారువాపై 22-20, 21-12 తేడాతో విజయం సాధించింది. మొదటి గేమ్ గట్టి పోటీ ఎదురైనప్పటికీ, రెండో గేమ్ లో సింధు పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది. క్వార్టర్ ఫైనల్లో ఆమె చైనీస్ తైపీకి చెందిన చెన్ సు-యుతో తలపడనుంది.