బిహార్‌లోని బక్సర్ జిల్లాలో ఈ వింత చోరీ వెలుగుచూసింది. గత 15 సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో నిరంతరాయంగా టెలికాం సేవలను అందిస్తున్న ఒక పెద్ద మొబైల్ టవర్‌ను దొంగలు గుట్టుచప్పుడు కాకుండా విరగ్గొట్టి, ముక్కలు ముక్కలుగా చేసి తరలించేశారు. కేవలం టవర్‌ను మాత్రమే కాకుండా, అక్కడ అమర్చిన భారీ జనరేటర్ మరియు దానికి సంబంధించిన ఇతర విలువైన టెలికాం సామగ్రిని కూడా దొంగలు వదలకుండా ఎత్తుకెళ్లడం గమనార్హం.