ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో ఆతిథ్య జట్లలో ఒకటైన మెక్సికో శుభారంభం చేసింది. గ్రూప్‌ఎలో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో మెక్సికో 20 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. ఆరంభం నుంచే మెక్సికో దూకుడుగా ఆడింది. ప్రత్యర్థి జట్టు గోల్ పోస్ట్‌వైపు పదేపదే దాడులు చేస్తూ ఉక్కిరిబిక్కిరి చేసింది. 9వ నిమిషంలోనే జులియన్ క్వినోన్స్ అద్భుత గోల్‌తో జట్టుకు ఆధిక్యం సాధించి పెట్టాడు. ఆ తర్వాత మెక్సికో మరింత ఎటాకింగ్ గేమ్ ఆడింది.