loader

స్పేస్ఎక్స్ ఐపీఓ సూపర్ హిట్…భారీ లాభాలతో లిస్ట్ అయిన షేర్

ప్రపంచమంతా ఎదురుచూస్తున్న స్పేస్‌ఎక్స్ ఐపీఓ భారీ లాభాలతో లిస్ట్ అయింది. అమెరికా స్టాక్ మార్కెట్ అయిన నాస్‌డాక్‌‌లో స్పేస్ఎక్స్ ఐపీఓ అడుగుపెట్టింది. స్పేస్ఎక్స్ ఐపీఓ షేర్ ధర 135 డాలర్లు కాగా, నాస్‌డాక్‌‌లో 150 డాలర్లకు ఈ షేర్ లిస్ట్ అయింది. కానీ నిమిషాల్లో వ్యవధిలోనే 160 డాలర్లకు చేరింది. స్పేస్ఎక్స్ బృందం న్యూయార్క్ నాస్‌డాక్‌లో అక్కడి కాలమానం ప్రకారం ఉదయం 9:30కి ఓపెనింగ్ బెల్ మోగించింది. ఆ బెల్ మోగడం వాల్ స్ట్రీట్ లో ట్రేడింగ్ […]

రేవంత్‌రెడ్డి ప్రయాణిస్తున్న విమానం దారి మళ్లింపు

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ప్రయాణిస్తున్న విమానాన్ని దారి మళ్లించారు. హైదరాబాద్‌లో ప్రతికూల వాతావరణం కారణంగా దిల్లీ నుంచి శంషాబాద్‌ వస్తున్న విమానాన్ని బెంగళూరుకు డైవర్ట్‌ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి సాయంత్రం 6.30 గంటలకు దిల్లీ నుంచి ఇండిగో విమానంలో బయలుదేరారు. హైదరాబాద్‌లో వర్షం కారణంగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడటంతో విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.

హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం

హైదరాబాద్ లో శుక్రవారం రాత్రి నైరుతి వాన దంచికొడుతోంది. సాయంత్రం వరకు సాధారణంగా ఉన్న వాతావరణం రాత్రికి ఒక్కసారిగా మారిపోయింది. ఉరుములు, మెరుపులతో హైదరాబాద్ లోని పలు ప్రాంతాలలో భారీ వర్షం పడుతోంది. గచ్చిబౌలి, కొండాపూర్, రాయదుర్గం, కొత్తగూడ చౌరస్తా, బోరబండ, అమీర్ పేట, పంజాగుట్ట పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. వర్షం ధాటితో పలు ఏరియాల్లోని రోడ్లపై భారీగా నీరు నిలుస్తోంది. దీంతో రోడ్లపై ఉన్న వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు మార్గాల్లో […]

‘పెద్ది’ టీంను అభినందించిన మెగాస్టార్ చిరంజీవి

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా కాంబినేషన్లో తెరకెక్కిన బిగ్గెస్ట్ మూవీ “పెద్ది”.. జూన్ 4న విడుదలయి భారీ కలెక్షన్స్ దిశగా దూసుకుపోతుంది. ఈ సందర్భంగా ‘పెద్ద’ సినిమా టీంకు మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలిపారు. సినిమా విడుదలైనప్పటి నుంచి పొల్లాచిలో షూటింగ్లో బిజీగా ఉన్న ఆయన, హైదరాబాద్ కు తిరిగి రాగానే చిత్రబృందాన్ని వ్యక్తిగతంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ భేటీ సందర్భంగా టీం సభ్యులతో చిరు ఆత్మీయంగా ముచ్చటించారు.

మొబైల్ టవర్ నే ఎత్తుకెళ్లిన బీహార్ దొంగలు

బిహార్‌లోని బక్సర్ జిల్లాలో ఈ వింత చోరీ వెలుగుచూసింది. గత 15 సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో నిరంతరాయంగా టెలికాం సేవలను అందిస్తున్న ఒక పెద్ద మొబైల్ టవర్‌ను దొంగలు గుట్టుచప్పుడు కాకుండా విరగ్గొట్టి, ముక్కలు ముక్కలుగా చేసి తరలించేశారు. కేవలం టవర్‌ను మాత్రమే కాకుండా, అక్కడ అమర్చిన భారీ జనరేటర్ మరియు దానికి సంబంధించిన ఇతర విలువైన టెలికాం సామగ్రిని కూడా దొంగలు వదలకుండా ఎత్తుకెళ్లడం గమనార్హం.

మెక్సికో శుభారంభం

ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో ఆతిథ్య జట్లలో ఒకటైన మెక్సికో శుభారంభం చేసింది. గ్రూప్‌ఎలో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో మెక్సికో 20 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. ఆరంభం నుంచే మెక్సికో దూకుడుగా ఆడింది. ప్రత్యర్థి జట్టు గోల్ పోస్ట్‌వైపు పదేపదే దాడులు చేస్తూ ఉక్కిరిబిక్కిరి చేసింది. 9వ నిమిషంలోనే జులియన్ క్వినోన్స్ అద్భుత గోల్‌తో జట్టుకు ఆధిక్యం సాధించి పెట్టాడు. ఆ తర్వాత మెక్సికో మరింత ఎటాకింగ్ గేమ్ ఆడింది.

భారత సిబ్బంది నౌకలపై దాడులు ఇరాన్ పనే: డొనాల్డ్ ట్రంప్

పశ్చిమాసియాలో భారతీయ సిబ్బందితో కూడిన రవాణా నౌకలపై దాడులు ఇరాన్ పనేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. భారతీయ నౌకలపై జరిగిన దాడుల్లో సిబ్బంది పలువురు మృతి చెందండం బాధాకరమని, ఆ దాడులను ఖండిస్తున్నట్లు శుక్రవారంనాడు ట్రూత్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. భారత నౌకలపై ఇరాన్ దాడులను తాము అడ్డుకున్నామని తెలిపారు. ఇలాంటి దాడులను అమెరికా ఎంత మాత్రం వెనకేసురాదన్నారు.

జైపూర్ పవర్ ప్లాంట్ నిర్మాణంలో భారీ స్కాం: హరీశ్ రావు

సింగరేణి సంస్థ జైపూర్ లో చేపడుతున్న పవర్ ప్లాంట్ నిర్మాణంలో భారీ అవినీతి జరుగుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. ఈ ప్లాంట్ ఆలస్యమవుతున్న కొద్దీ ఏడాదికి రూ.750 కోట్ల భారం, అంటే రోజుకు సుమారు రూ.రెండున్నర కోట్ల నష్టం వస్తోందన్నారు. తెలంగాణలో ఉన్న ఎన్టీపీసీ అతి తక్కువ ధరకే విద్యుత్తు ఇస్తానంటే.. సింగరేణి సంస్థ ఎక్కడో జైపూర్లో ఎందుకు పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తోందని ప్రశ్నించారు. డీపీఆర్ కు అనుమతులే ఇవ్వలేదని, విద్యుత్తు కొనుగోళ్ల […]

సిడ్నీలో సింధు సింహగర్జన.. సెమీస్‌లోకి ఎంట్రీ!

భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కోర్టులో పంజా విసిరింది! సిడ్నీ వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ప్రత్యర్థికి చుక్కలు చూపిస్తూ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మలేషియా ఓపెన్ 2026 తర్వాత ఈ సీజన్లో సింధు సెమీస్ కు చేరడం ఇది రెండోసారి. క్వార్టర్ ఫైనల్లో చైనీస్ తైపీ ఆటగాడు చెన్ సు యును సింధు ఊచకోత కోసింది. కేవలం 27 నిమిషాల్లోనే 21-6, 21-9 తేడాతో ప్రత్యర్థిని మట్టికరిపించింది. ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న సింధుకు […]

పవన్‌ మీటింగ్‌పై రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు

తెలంగాణకు వచ్చి వెళ్లేందుకు.. పోటీ చేసేందుకు పవన్ కల్యాణ్ కు పూర్తి స్వేచ్ఛ ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడినందునే పవన్ పై తెలంగాణ మంత్రులు మాట్లాడారని చెప్పారు. “శాంతి భద్రతల కారణంగానే పవన్ మీటింగ్ కు అనుమతి ఇవ్వలేదు. ఏపీలో జగన్ సభలకు ఎందుకు అనుమతి ఇవ్వట్లేదో పవన్ చెప్పాలి? కేటీఆర్ చెప్పినట్లు కిషన్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారు. మెట్రో విస్తరణను కిషన్రెడ్డితో మాట్లాడి అడ్డుకున్నట్లు కేటీఆర్ ప్రకటించారు” అని […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON