తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ప్రయాణిస్తున్న విమానాన్ని దారి మళ్లించారు. హైదరాబాద్‌లో ప్రతికూల వాతావరణం కారణంగా దిల్లీ నుంచి శంషాబాద్ వస్తున్న విమానాన్ని బెంగళూరుకు డైవర్ట్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి సాయంత్రం 6.30 గంటలకు దిల్లీ నుంచి ఇండిగో విమానంలో బయలుదేరారు. హైదరాబాద్‌లో వర్షం కారణంగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడటంతో విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.