ప్రపంచమంతా ఎదురుచూస్తున్న స్పేస్‌ఎక్స్ ఐపీఓ భారీ లాభాలతో లిస్ట్ అయింది. అమెరికా స్టాక్ మార్కెట్ అయిన నాస్‌డాక్‌లో స్పేస్ఎక్స్ ఐపీఓ అడుగుపెట్టింది. స్పేస్ఎక్స్ ఐపీఓ షేర్ ధర 135 డాలర్లు కాగా, నాస్‌డాక్‌లో 150 డాలర్లకు ఈ షేర్ లిస్ట్ అయింది. కానీ నిమిషాల్లో వ్యవధిలోనే 160 డాలర్లకు చేరింది. స్పేస్ఎక్స్ బృందం న్యూయార్క్ నాస్‌డాక్‌లో అక్కడి కాలమానం ప్రకారం ఉదయం 9:30కి ఓపెనింగ్ బెల్ మోగించింది. ఆ బెల్ మోగడం వాల్ స్ట్రీట్ లో ట్రేడింగ్ ప్రారంభానికి సంకేతంగా మారింది.