ముందు ఓట్ చోరీ.. ఇప్పుడు సీట్ చోరీ.. బీజేపీపై రేవంత్ విమర్శలు
బీజేపీ సర్ ప్రక్రియతో దేశంలో ఓట్ చోరీకి పాల్పడిందని, ఇప్పుడు ఏకంగా రాజ్యసభ సీట్ చోరీకి పాల్పడుతోందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. కేంద్ర ఎన్నికల సంఘం మధ్యప్రదేశ్ లో మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ను తిరస్కరించడంపై సీఎం మండిపడ్డారు. బీజేపీ చేసిన కుట్ర కారణంగా మీనాక్షి రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురైందన్నారు. తెలంగాణలో మీనాక్షి నటరాజన్ పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని, నామినేషన్ తిరస్కరణపై న్యాయం కోసం కలిసి పోరాడుతామని సీఎం వెల్లడించారు.

