హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం జోరుగా వర్షం కురిసింది. కేపీహెచ్‌బీ కాలనీ, మియాపూర్, హిమాయత్‌నగర్, రామ్ నగర్ సహా అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లపై నీరు నిలిచిపోయి, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రజలు వర్షంలోనే తడుస్తూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు రానున్న రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.