మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా మీనాక్షి నటరాజన్ సమర్పించిన నామినేషన్ అఫిడవిట్ లో ఆమె.. తెలంగాణలో నమోదైన ఓ క్రిమినల్ కేసుకు సంబంధించిన సమాచారాన్ని దాచిపెట్టినట్లు నిర్ధారించి ఎన్నికల అధికారులు దాన్ని తిరస్కరించారు. నటరాజన్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ బీజేపీ నాయకులు ఫిర్యాదు మేరకు ఈసీ అధికారులు వెంటనే నిర్ణయం తీసేసుకున్నారు. నటరాజన్ ఎలాంటి క్రిమినల్ కేసును ఎదుర్కోవడం లేదని,కేవలం ఒక కోర్టు నోటీసుకు మాత్రమే సంబంధించింది కానీ, అధికారికంగా నమోదైన క్రిమినల్ కేసుకు కాదని కాంగ్రెస్ నేతలు తెలిపారు.