ఒక మహిళ రైలు తీవ్రంగా ఆలస్యం కావడంతో.. అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 1.45 గంటల సమయంలో ఆమె లింగపల్లి రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. పోలీసు హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసి సహాయం కోరింది.తనను ఇంటి వద్ద దింపాలని అడిగిన యువతికి, అలాంటి రూల్ ఏమీ లేదని, ప్రయాణాలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని తెలీదా అంటూ పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆమె వీడియోలో షేర్ చేసింది. SMలో పెద్ద ఎత్తున వైరల్ కావడంతో, పోలీస్ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశాలు జారీ చేశారు.