తమిళనాడు స్పీకర్ జేసీడీ ప్రభాకర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 21 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పిటిషన్ ను తోసిపుచ్చారు. దీంతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామికి మరో రాజకీయ ఎదురుదెబ్బ తగిలింది. మే 13న జరిగిన కీలకమైన బలపరీక్షలో ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌కు అనుకూలంగా ఓటు వేసిన 21 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న పళనిస్వామి అభ్యర్థనను స్పీకర్ తోసిపుచ్చినట్లు ఆయన కార్యాలయం ప్రకటించింది.