పీవోకేలో తాము చేసిన ఈ ఘోర దురాగతాలను, పౌరుల మారణహోమాన్ని ప్రపంచ దేశాల దృష్టి పడకుండా కప్పిపుచ్చుకునేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని, అందుకోసం పాక్ యంత్రాంగం ఉద్దేశపూర్వకంగానే సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలను, ఎడిట్ చేసిన నకిలీ వీడియోలను వ్యాప్తి చేస్తూ అంతర్జాతీయ సమాజాన్ని పక్కదారి పట్టించాలని చూస్తోందని భారత్ ఎండగట్టింది. అక్కడ జరుగుతున్న అరాచకాలకు, మానవ హక్కుల ఉల్లంఘనకు పాకిస్థాన్ పూర్తిగా బాధ్యత వహించేలా ప్రపంచ దేశాలు తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకుంటాయని ఆశిస్తున్నట్లు భారతదేశం స్పష్టం చేసింది.