సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘మహిళా శక్తి’ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడుతున్నా తన మంత్రివర్గ సహచరులతో కలిసి వేదికపైకి చేరుకున్న సీఎం.. మహిళా స్వయం సహాయక సంఘాల (SHG) నిర్వహణ కోసం కేటాయించిన 553 నూతన ఆర్టీసీ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు.
లబ్ధిదారులైన మహిళా సంఘాల ప్రతినిధులను కలిసి, వారికి కొత్త బస్సులను అప్పగించడంతో పాటు, బస్సుల హైర్ ఛార్జీలకు సంబంధించిన అడ్వాన్స్ చెక్కులను స్వయంగా అందజేశారు.